ప్రయాణానికి కొన్ని చిట్కాలు
ప్రయాణం అంటేనే ఓ మంచి అనుభవం, ఎప్పటికి మర్చిపోలేని ఓ జ్ఞాపకం.
ఆ జ్ఞాపకం మధురంగా ఉండిపోవాలంటే ప్రయాణం చేసే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే అన్నీ విషయాల గురించి తెలుసుకొని ప్రయాణం ప్రారభించాలి లేకపోతే చెడు అనుభవం ఎదురవుతుంది, ప్రయాణం మొత్తం కూడా ఒత్తిడి కలిగిస్తుంది.
ప్రయాణాలు చేసేది రోజువారీ జీవన విధానానికి కాస్త విముక్తి ఇవ్వడం కోసం అలాగే మనసుని ఆహ్లాదంగా ఉంచుకోవడం కోసం..
అందుకోసం ఎన్నో ప్రణాళికలు వేసుకున్నప్పటికి, ఎంతో ఖర్చు పెట్టినప్పటికి ఎక్కడో ఒకచోట నిరాశ కల్గించే సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి.
నిరాశ కల్గించే సంఘటన, సందర్బం ఒక్కటీ ఎదురైతే చాలు ఎన్నో ఉత్సాహకరమైన సంఘటనలని పాడు చేస్తుంది.
అందుకోసమే ప్రతిదీ కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. ఏదో సరదా కోసమో వెళ్ళకుండా ఆ ప్లేస్ గురించి, ప్రయాణం గురించి అవగాహన ఉంటేనే ప్రయాణం చేయడం మంచిది లేకపోతే మనం అలాగే మనతో పాటు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది..
వెళ్లే చోటు మీద అవగాహన :-
ముందుగా మీరు వెళ్లాలనుకున్న ప్లేస్ నిర్ణయించుకోండి అలాగే ఆ ప్లేస్ కి మీరు ఆన్ సీసన్ సమయంలో వెళ్తున్నారా లేకపోతే ఆఫ్ సీసన్ సమయం లో వెళ్తున్నారా అనేది నిర్ధారించుకోండి.
ఆన్ సీసన్ లో వెళ్తే మంచి అనుభవం పొందుతారు అలాగే కేవలం అక్కడి స్థానిక ప్రజలతో మాత్రమే కాకుండా వేరే వేరే ప్రదేశాల నుండి వచ్చే పర్యాటకులతో పరిచయం ఏర్పడుతుంది.
ఏదైనా సమస్య వస్తే వాళ్ళ సహాయం తో పరిష్కారం కూడా చేసుకోవచ్చు.
ఎల్లపుడు కూడా సమూహంలో ఉండేలా చూసుకోండి..
ఆఫ్ సీసన్ లో అయితే మంచి అనుభవం దొరకడం కష్టం.
ప్లేస్ నిర్ణయించుకునే ముందు ఆ చోటు గురించి అన్నీ విధాలుగా తెలుసుకోండి. కేవలం టెక్నాలజీ పరంగా మాత్రమే కాకుండా మీకు తెల్సిన సన్నిహితులు అలాగే స్నేహితులని అడగండి.
ఎవరైనా ఆ చోటుకి వెళ్లి ఉంటే వాళ్లని అడగడం, వాళ్ళ దగ్గర కొన్ని సలహాలు తీసుకోవడం ఇంకా మంచిది.
ఆ చోటుకి ప్రతిరోజు ఎంతమంది పర్యాటకులకి అనుమతి ఉంది? ప్రవేశ సమయాలు.. కావాల్సిన సదుపాయాలు, ఫుడ్ అలాగే మొత్తం ఖర్చు ఎంత అవుతుంది.. ఇలా ప్రతి ఒక్కటీ కూడా లోతుగా తెలుసుకోండి.
వాహన మార్గం :-
వెళ్లే ప్రదేశం లో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటే వాహన మార్గం ఎలా ఉంటుంది..?
ట్రిప్ కింద వాళ్లే తీసుకోని వెళ్తారా లేకపోతే అక్కడ ఉన్నన్ని రోజులు అన్నీ ప్లేసెస్ చూడటానికి మనమే స్వయంగా ఓ క్యాబ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందా లేదా అని నిర్ధారించుకొని మీ బడ్జెట్ లో ఇది కూడా ఉండేలా చూసుకోండి..
ప్రయాణం లో అలాగే బడ్జెట్ లో ఇది చాలా ముఖ్యం కాబట్టి దీనికి మొదటి ప్రాముఖ్యత ఇవ్వండి.
బడ్జెట్ ప్లానింగ్ :-
ఎంతమంది వెళ్తున్నారు? ఎన్నిరోజులు ఉంటారు? అనేది దృష్టిలో పెట్టుకొని కూడా మంచి బడ్జెట్ నిర్ణయించుకోండి.
ముందు అయితే వెళ్లే ప్రదేశంలో చూడాల్సిన ప్లేసెస్ ని బట్టి మీరు అక్కడ ఎన్నిరోజులు ఉండాలని నిర్ణయించుకుంటే మంచిది లేకపోతే ఖర్చులో తేడా వస్తుంది.
సౌకర్యంగా ఉండేలా చూసుకోవడం :-
ముందు చెప్పినవి ఫైనల్ చేసుకున్నాక ఏ హోటల్ లో ఉంటే మంచిదో తెలుసుకోండి కేవలం బడ్జెట్ ని మాత్రమే కాకుండా మీరు సందర్శించే ప్లేసెస్ యొక్క దూరాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్లేముందే బుక్ చేసుకోండి.
భాష :-
తరవాత అక్కడ స్థానిక భాష ఏంటో తెలుసుకొని ఆ భాషలో కొన్ని ప్రాథమిక వాక్యాలు నేర్చుకుంటే మంచిది లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఆహారం :-
ఇంకా మిగిలింది ఫుడ్.. ఖచ్చితంగా మన ఇంట్లో ఉండే భోజనం ఎవరింటికి వెళ్లిన దొరకదు అలాంటివది వేరే ప్రదేశాలకి వెళ్తే దొరుకుతుందా..?
అందుకే ముందే స్నాక్స్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి.. అక్కడికి వెళ్ళాక మీరు చాలా ప్రదేశాలు సందర్శించేటప్పుడు మీతో పాటు క్యారీ చేయండి..
అక్కడ భోజనం సరిగ్గా లేకపోయినా మరియు కడుపు నిండా తినే అవకాశం లేనప్పుడు ఇదే చాలా ఉపయోగపడుతుంది.
లేకపోతే ఆకలి భాద వలన.. అక్కడి ఫుడ్ పడక హెల్త్ అప్సెట్ అయితే ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదించలేము.. కష్టపడి వేసుకున్న ప్లాన్, బడ్జెట్ అంతా వృధా అయిపోతుంది కాబట్టి ఫుడ్ గురించి కూడా శ్రద్ధ తీసుకోండి.
లగేజ్ :-
ఇకపోతే క్లోత్స్.. పదిరోజులు ట్రిప్ ప్లాన్ చేసుకుంటే పది రోజులకి సరిపడా మాత్రమే పెట్టుకోండి ఎక్సట్రా వద్దు.. ఎందుకంటే రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ చేసిన షాపింగ్ ఎలాగో ఎక్సట్రా లగేజ్ అవుతుంది..
లగేజ్ సాధ్యమైనంతవరకు తక్కువ ఉండేలా ప్లాన్ చేసుకోండి అలాగే అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఒక జత ఎక్కువ పెట్టుకుంటే మంచిది అలాగే అక్కడి వాతావరణాన్ని ముందే తెలుసుకొని స్వేటర్స్ తీసుకోని వెళ్లడం ఇంకా మంచిది.
ముఖ్యమైన వస్తువులు :-
ఆఖరికి చాలా ముఖ్యమైన అంశం.. ప్రయాణానికి కావాల్సిన పత్రాలు అలాగే మొబైల్ ఫోన్స్, చార్జర్స్..
తరుచు అవసరం అయ్యే వాటన్నిటిని ఒక హాండ్ బ్యాగ్ లో పెట్టుకొని ఎప్పటికి మన వెంటే పెట్టుకుంటే మంచిది ప్రతిసారి బ్యాగ్ ఓపెన్ చేసే బదులు..
లొకేషన్ :-
ఇంకా లొకేషన్ గురించి టెక్నాలజీ మీద పూర్తిగా ఆధారపడకుండా పక్కన వాళ్లని అడగండి.. అలా ఒక ఇద్దరు, ముగ్గురు దగ్గర చెక్ చేసుకొండి.
మీకున్నా రోజులలోనే అన్నీ సందర్శించేలా సమయాన్ని మంచిగా ప్లాన్ చేసుకోండి.. మరి ఎక్కువ అలసట లేకుండా చూసుకుంటే అన్నీ ప్రదేశాలు చుట్టేయచ్చు.
ఎంత ఖచ్చితమైన బడ్జెట్ ప్లానింగ్ చేసుకున్నప్పటికి బడ్జెట్ కంటే ఎక్కువ డబ్బులని వెంటే ఉంచుకోండి.
ఉన్నచోటు మారితే ఆరోగ్యం లో తేడా వస్తుంది కాబట్టే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. ఆరోగ్యానికి సంబంధించిన కొన్నిటిని లగేజ్ లో ఉండేలా చూసుకోండి.
ముఖ్యంగా సరిగ్గా అవగాహన ప్రదేశాలకి వెళ్ళకండి.
పేపర్ వర్క్ :-
ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకునే ముందు పైన చెప్పిన వాటన్నింటికి ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని బట్టి ఫాలో అయ్యి అన్నీ సిద్ధం చేసుకొని.. ఆ పని పూర్తి అయ్యాక టిక్ చేయండి..
అప్పుడు ప్రయాణం మొదలు పెట్టేముందు ఏదో మర్చిపోయాం అన్నా ఆలోచన లేకుండా మనశాంతిగా ప్రయాణాన్ని మొదలుపెట్టి.. ప్రయాణం ముగిసేవరకు మనస్ఫూర్తిగా ప్రతి క్షణం ఆస్వాదీస్తూ మంచి అనుభవాన్ని మరియు మధురమైన జ్ఞాపకాలని పొందవచ్చు.
———-
To share..
1 thought on “ప్రయాణానికి కొన్ని చిట్కాలు”