పరీక్షలకి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

 

పరీక్షలకి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

జీవితంలో స్థిరపడలన్నా, మంచి భవిష్యత్ పొందాలన్న అది యవ్వనంలో మనం తీసుకునే నిర్ణయాలు మరియు పడే కష్టం మీద ఆధారపడి ఉంటుంది.

సంవత్సరం అంతా ఎలా ఉన్నకాని పరీక్షల సమయంలో స్థిరంగా ఉంటు శ్రద్ద పెట్టి చదివితే మంచి ఫలితం ఉంటుంది.

లక్ష్యాన్ని నిర్ణయించుకోండి  :-

ముందుగా ఏ సబ్జెక్టులలో ఎన్ని మార్కులు రావాలి అలాగే పరీక్ష మొత్తంలో ఎన్ని మార్కులు సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకోండి.

తద్వారా ఆ లక్ష్యమే చదవడానికి ప్రేరేపిస్తుంది.


ప్రణాళిక :-

ముందుగా ప్రతి సబ్జెక్టులో చదవాల్సిన సిలబస్ ఎంతుందో అదంతా ఓ పేపర్ పైన రాసుకోవాలి. తరువాత ప్రతి పాఠంలోని ముఖ్యమైన ప్రశ్నలను అలాగే రిపీటెడ్ గా వచ్చే ప్రశ్నలకి రౌండప్ చేసుకోవాలి.

తద్వారా మీకు అవగాహన వస్తుంది ఇంపార్టెంట్ మరియు రిపీటెడ్ గా వచ్చే ప్రశ్నలు ఎన్ని ఉన్నాయని. దాన్ని బట్టి అవి ఎన్ని రోజులలో చదవడం పూర్తి చేయాలో నిర్ణయించుకోండి.

ఎప్పుడు కూడా నిర్ణయించుకున్న ప్రణాళికని పోస్ట్ ఫోన్ చేయవద్దు. అలా చేయడం వల్ల ముందు ముందు మీకే ఇబ్బంది అవుతుంది, పూర్తి చేయాల్సినవి కూడా పెండింగ్లో ఉండే అవకాశం ఉంటుంది. అలాంటపుడు ఒత్తిడి పెరిగి చదువు పై శ్రద్ద పెట్టలేకపోవచ్చు.

మీరు అనుకున్న సమయంలోపు ఇంపార్టెంట్ మరి రిపీటెడ్ ప్రశ్నలను పూర్తి చేసిన తర్వాత మిగిలిన సిలబస్ కి కూడా కొంత సమయం పెట్టుకొని  పూర్తి చేయండి.

గుర్తుంచుకోండి పరీక్షకి మరియు మీరు సిలబస్ అంత పూర్తి చేసే సమయానికి మధ్యలో రెండు రోజులు గ్యాప్ ఉండేలా చూసుకోండి.. అప్పుడు మైండ్ ఫ్రీ గా, రిఫ్రెష్ గా ఉంటుంది.

పరీక్షకి సంబంధించిన సిలబస్ అంతా ఒక పేపర్ మీద రాసుకుని మీరు నేర్చుకున్న ప్రశ్నల పక్కన ఓ టిక్త చేసుకొండి. తద్వారా మీరు ఆ పేపర్ ఒకసారి చూసుకున్నప్పుడు ఎన్ని చదివారు, ఇంకెన్ని చదవాలి అనేది సులువుగా తెలుస్తుంది.

ముందుగానే పేపర్ మీద నోట్ చేసుకొని అన్ని చదవడం వలన ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదన్న టెన్షన్ ఉండదు.

అలాగే ప్రతి సబ్జెక్టు కి కూడా కొంత సమయం పెట్టుకోండి.

రివిజన్ :-

చదివే సమయంలోనే ఇంపార్టెంట్ పాయింట్స్ అలాగే ఫార్మలా లు అండర్ లైన్ చేసుకుంటే రివిజన్ చాలా సులువుగా మరియు అతి తక్కువ సమయంలో పూర్తవుతుంది.

పాటించాల్సిన కొన్ని విషయాలు :-

చదివేటప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోండి.

ఉదయం మరియు సాయంత్రం మాత్రమే చదవటానికి ఇష్టపడండి. మధ్యాహ్న సమయంలో అయితే బుక్ పట్టుకోగానే నిద్ర రావడం వలన శ్రద్ధ తగ్గిపోవచ్చు.

తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి లేకపోతే ఒత్తిడి పెరుగుతుంది.

రాత్రి అందరు పడుకున్నాక మరియు తెల్లవారుజామున అయితే ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కూడా చదివితే సులువుగా గుర్తుంటుంది.

ఈ సమయంలో ఫోన్ కి, సోషల్ మీడియాకి దూరంగా ఉంటే మంచిది. ఫోన్ పక్కన పెట్టుకొని చదివితే మాటిమాటికి చూపు దానిమీదనే ఉంటుంది అలాగే నోటిఫికేషన్ శబ్దంరాగానే ఫోన్ వైపు మనసు మర్లుతుంది.

పాత పరీక్ష పేపర్లను పరిశీలించడం ద్వారా పరీక్ష పేపర్ ఏ విధంగా వస్తుంది అనేది ఒక అవగాహన ఉంటుంది. దాన్ని బట్టి పరీక్షకి ప్రిపేర్ అవ్వాలి.

ఎక్కువ ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఒత్తిడి సమయంలో బుక్స్ పట్టుకోకుండా కాస్త రిలాక్స్ అయ్యి అప్పుడు మళ్ళీ చదవడం ప్రారభించాలి.

ఇంటర్లో భౌతికశాస్త్రం గణితం పై ఆధారపడి ఉంటుంది కాబట్టి గణితం లో ఫార్ములాలని మంచిగా నేర్చుకుంటే భౌతిక శాస్త్రం పరీక్ష కూడా సులువుగా రాసేయగలరు.

కెమిస్ట్రీ లో కూడా రసాయనాల పేర్లని, వాటి ఫార్ములాలని బాగా కంఠస్థం చేయండి.

బయాలజీ, జూలోజి లో డ్రాయింగ్స్ బాగా నేర్చుకోండి. పరీక్షలో ఆ డ్రాయింగ్ ని కూడా వివరించండి.

డ్రాయింగ్ లేని ప్రశ్నలకి సమాధానంలో ఉపశీర్షికలు (సైడ్ హెడ్డింగ్ ) ఇస్తూ రాయండి. చూడటానికి నీట్ గా ఉంటుంది.

చదివే సమయంలో మధ్య మధ్యలో విరామం ఇస్తే మంచిది.

పరీక్ష సమయంలో గుర్తుంచుకోవాలిసిన విషయాలు :-

పరీక్షకి రెండు గంటల ముందు సబ్జెక్ట్ కి సంబంధించిన పుస్తకం ముట్టుకోకూడదు.

పరీక్ష కేంద్రానికి వెళ్లాక స్నేహితులతో చదువుకున్న ప్రశ్నల గురించి కూడా చర్చించకూడదు.

క్లాస్ రూమ్ లోకి వెళ్లే వరకు మైండ్ పై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకుంటే అప్పుడు పరీక్షని చాలా సులువుగా అలాగే నేర్చుకున్న సమాధానాలు చకచక రాయచ్చు.

ముందుగా ఎక్కువ మార్కులు ఉండే ప్రశ్నలన్నింటినీ రాయాలి. ఆ ప్రశ్నలు కూడా ఏ టైం లోపు పూర్తి చేయాలో నిర్ణయించుకొని ఆ సమయంలోపు పూర్తి చేసి తర్వాతకి స్వల్ప సమాధానాలు రాయాలి. ఉండే మూడు గంటలని కూడా సరైన విధంగా ఉపయోగించుకోవాలి.

ముందుగా వచ్చిన సమాధానాలు అన్ని రాశాక ఆ తర్వాత రాని సమాధానాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాలి ముందే ఈ పని చేస్తే సమయం వృధా అవుతుంది.

ముగింపు :-

పరీక్ష రాసి బయటకి వచ్చాక ఆ సబ్జెక్టుకు సంబంధించిన బుక్ ని తీసుకోని అన్ని సరిగ్గా రాశారో లేదో అని చెక్ చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే అది మీ మైండ్ ని ప్రభావితం చేస్తుంది అలాగే మరుసటి రోజు పరీక్షకి సిద్ధం అవ్వడం కోసం సహకరించకపోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!