సోలో ట్రిప్ కి కొన్ని సూచనలు

సోలో ట్రిప్ కి కొన్ని సూచనలు 

ప్రస్తుతం ట్రిప్ అనే మాట ప్రతి ఒక్కరి షెడ్యూల్ లో భాగం అయింది. సమయం కుదుర్చుకొని మరి గ్రూప్ ట్రిప్స్ లేకపోతే సోలో ట్రిప్ వెళ్తున్నారు చాలామంది.

గ్రూప్ ట్రిప్ లో అయితే సందడి, హుషారు బోలెడంత ఉంటుంది. సోలో ట్రిప్ లో అయితే మనతో మనకు మాత్రమే సందడి, ఆనందం.

మన గురించి మనకి మరింత తెలియాలి అంటే సోలో ట్రిప్ వేయాల్సిందే. ఈ సోలో ట్రిప్ మనలో ఉండే స్ట్రెంగ్త్, మన ఆలోచనల మీద ఓ అవగాహనని తీసుకోని వస్తుంది.

గ్యాంగ్స్ తో వెళ్తే ఒక సరదా, ఫ్యామిలీ తో వెళ్తే వేరే సరదా, పార్టనర్ తో వెళ్తే మరో సరదాగా ఉంటుంది ట్రిప్. మనకు నచ్చినట్టుగా మనం ఉండటానికి, చేయడానికి, నచ్చింది చూడటానికి అయినా సోలో ట్రిప్ కి వెళ్ళాలి.

వెళ్లాలనుకున్న చోటుని ఎంచుకోవడం :-

ముందు గా మీరు వెళ్ళాలనుకొనే చోటుని నిర్ణయించుకొనే ముందు ఆ చోటు గురించి మొత్తం తెలుసుకోండి.

ఆ చోటుకి వెళ్తే బడ్జెట్ ఎంత అవుతుంది..? హోటల్, ఫుడ్ మరియు ఆచోటుకి ఒంటరిగా వెళ్ళచ్చా..? అని మరి ముఖ్యంగా అమ్మాయిలు..

ట్రిప్స్ ప్లాన్ చేసేది ఒత్తిడి నుండి ఉపశమనం పొందడం కోసం. అందుకే ఏ చోటుకి వెళ్తే మెదడు అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుందో ఆ చోటుని ఎంచుకోండి.

ఆ తర్వాత మీరు ఉన్న చోటు నుండి మీరు వెళ్ళాలని అనుకున్న చోటు కి రవాణా మార్గాలు ఏవేవి ఉన్నాయి అనేది ఫోన్ లో చూసుకోని .. ఏ మార్గం నుండి వెళ్తే మీరు సౌకర్యంగా, సులువుగా వెళ్తారో..? అక్కడికి వెళ్ళాక ఎక్కడ ఉండాలి..? ఏం చూడాలి..!? అని ముందుగానే సిద్ధం చేసుకోండి.

లగేజ్ :-

సోలో ట్రిప్ కాబట్టి మన లగేజ్ మనమే మోయాలి అందుకే లిమిటెడ్ గా అత్యవసర వస్తువులు తీసుకోని వెళ్ళండి.

బట్టలు, వాలెట్, ఫోన్, చార్జెర్ మరియు ఐడెంటిటీ కార్డ్స్ కూడా అన్నీ ప్యాక్ చేసుకోండి. వెళ్లబోయే చోటును దృష్టిలో పెట్టుకుని అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా బట్టలు ప్యాక్ చేసుకుంటే మంచిది.

డబ్బులు కూడా అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువే పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే అక్కడ రవాణా మార్గాలు అలాగే ఆహారం, షాపింగ్ ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని అమౌంట్ అనేది ఒక ప్రణాళిక వేసుకొని..వేసుకున్న దానికంటే ఎక్కువగా వాలెట్లో ఉంచుకోవాలి.

ఎక్సప్లోర్ :-

మీరు ఉన్న ప్రాంతం కి చుట్టూ పక్కల చూడదగిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయో గూగుల్ ద్వారా తెలుసుకొని అదంతా ముందుగా సిద్ధం చేసుకున్నప్పుడే ఏ రోజులలో ఎన్ని చోట్లకి వెళ్ళాలి అలాగే మొత్తం ఎన్ని రోజులలో ట్రిప్ పూర్తి చేయాలని ముందే ఒక ప్రణాళిక వేసుకొని దాన్ని ఫాలో అవ్వండి.

తద్వారా సమయం కలిసి వస్తుంది అలాగే ఇంకెన్ని చోట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడికి వెళ్లాలి అన్న టెన్షన్ కూడా ఉండదు.మీరు ఉన్న హోటల్ నుండి మీరు సందర్శించాలి అనుకున్న చోటు దగ్గర అయితే నడవడం లేదా రెంటల్ బైక్ ద్వారా మాప్స్ ఫాలో అవుతూ వెళ్ళండి.

సమాచారం ఇవ్వడం మర్చిపోవద్దు :-

హోటల్స్, రెస్టారెంట్ రేటింగ్స్ అంత చెక్ చేసుకొని వెళ్ళండి. కాంటాక్ట్ నంబర్స్ గుర్తుకు పెట్టుకోండి. ఇంట్లో వాళ్లకి మరియు స్నేహితులకి ఎప్పటికప్పుడు మీ యొక్క సమాచారము ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మీరు ఉన్న హోటల్ నెంబర్ కూడా వాళ్ళకి ముందే ఇస్తే మంచిది.

అన్నిటికంటే ముఖ్యమైన విషయం కొత్త ప్లేస్ కి వెళ్తున్నాం అని ఎగ్జాస్ట్మెంట్ అలాగే సోలో గా వెళ్తున్నాం అనే భయం మన మొహం లో కనిపించకూడదు. ఎందుకంటే మన అవసరం ఎదుటి వారికీ అవకాశంగా మారచ్చు.

కాబట్టి భయాన్ని పక్కన పెట్టి మీ గురించి మీరు తెలుసుకోవాలని లేదా కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళాలని లేకపోతే మీతో మీరు సమయం గడపడం కోసం ఖచ్చితంగా ఒంటరిగా ప్రయాణం చేయండి.

Leave a Comment

error: Content is protected !!