ఎలగందల్ కోట

ఎలగందల్ కోట

ఎలగందల్ కోట


తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలలో ఒకటైన కరీంనగర్ జిల్లా నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలగందల్ గ్రామంలో ఈ ఎలగందల్ కోట ఉంది.

కరీంనగర్ జిల్లాకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామారెడ్డి రోడ్డు మార్గంలో మానేరు నది తీరంలో ఉన్న ఈ ఎలగందల్ కోట ఒకప్పుడు కుతుబ్ షాహి వంశం, మొఘల్ సామ్రాజ్యం మరియు హైదరాబాద్ నిజాం నియంత్రణలో ఉండేది. చారిత్రకంగా అయిదు సామ్రాజ్యాల చేత పాలించబడిన ఈ కోట కరీంనగర్ జిల్లాలో ముఖ్యమైన చారిత్రక ప్రదేశం.

  ఎలగందల్ కోట నుంచి మానకొండూరు వరకు కరీంనగర్ -వేములవాడ రహదారిలో 9 కిలోమీటర్ల మేరకు రహస్యమార్గం ఉందని ప్రజలు నమ్ముతున్నారు.


ఈ కోట వెనుక దాగిన చరిత్ర :-


వెలగందుల మరియు బహుధాన్యాపురం కోట అని పిలువబడే ఈ ఎలగందల్ కోటని కాకతీయుల కాలం నాటి సామంతుల పాలనలో వైభవాన్ని చాటుకుంది. ఎతైనా కోట గోడలు, అగడ్తలు, బలమైన చెక్క తలుపులు, వంకర టింకర దారులు మరియు రాజ దర్బారు కలిగిన మసీదులతో ఈ కోట అలరారుతోంది.

  యోధులైన ముసునూరి నాయక్, రాచర్ల పద్మనాయక్ దృడంగా చేసిన ఈ ఎలగందల్ కోటని 16 వ శతాబ్దంలో కుతుబ్ షాహీ వంశస్థులు ఆక్రమించుకొని క్యూయినమూల్ ఉల్ ను కమాండర్ గా నియమించారు.తదనంతరం ఈ కోట మొఘల్ సామ్రాజ్య ఆధీనంలోకి వెళ్ళింది.

  సికిందర్ ఝా (1803-1823) హయాంలో దంసా 1754 లో పునర్నిర్నాణం చేసిన ఈ కోటకు బహదూర్ ఖాన్ మరియు కరిముద్దిన్ లు ఖిలేదార్లుగా పనిచేసారు.

  కరీంనగర్ కి నిజాం పాలనలో ప్రధాన కార్యాలయంగా ఉన్న ఈ కోట ఉండేది.

ఈ ఎలగందల్ గ్రామంలో మరో చివర ‘ దో మినార్ ‘ అనే కట్టడం ఉంది. బహమని సుల్తానులు ముస్లింలు వారి పండుగ రోజుల్లో ప్రార్ధన చేసే ఈద్ గా నిర్మించారు. దీనికి లోపల నుంచి మెట్లు ఉన్నాయి.


ఎలగందల్ కోటలో మొత్తం 53 బురుజులు ఉన్నాయి. 1754 సంవత్సరంలో జఫర్ – ఉద్ – దౌలా ఈ కోట యొక్క తూర్పు ద్వారం దగ్గర బృందావన్ ట్యాంక్ ను నిర్మించాడు.


  శత్రువులు లోనికి రాకుండా మరియు వారి దాడులని నిరోధించడానికి ఎలగందల్ పాలకులు కోట చుట్టూ సుమారు 5 మీటర్లు అంటే 16 అడుగుల వెడల్పు మరియు 4 మీటర్లు అంటే 13 అడుగుల లోతైనా కందకాన్ని ఏర్పాటు చేసి అందులో మొసళ్లు వదిలేవారు.

రవాణా సదుపాయాలు :–


రోడ్డు మార్గం :-

కరీంనగర్ నుంచి కమాన్ పూర్ మరియు బావుపేట మీదుగా ప్రైవేట్ బస్సులు మరియు ఆటోలు నడుస్తూనే ఉంటాయి. కరీంనగర్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో గల ఎలగందల్ గ్రామంలో ఈ ఎలగందల్ కోట ఉన్నది.

రైలుమార్గం :-

  కరీంనగర్ లో రైల్వే స్టేషన్ సదుపాయం కలదు. అక్కడ నుంచి ప్రైవేట్ టాక్సీ లో అయినా ఎలగందల్ చేరుకోవచ్చు లేదా బస్ స్టాండ్ కి వెళ్లి ఎలగందల్ గ్రామం బస్ ఎక్కి ఎలగందల్ కోటకి వెళ్ళవచ్చు.

వాయుమార్గం :-

  ఎలగందల్ కోట హైదరాబాద్ నుంచి 180 కిలోమీటర్ల దూరంలో కలదు. కావున, పర్యాటకులు శంషాబాద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి క్యాబ్ లలో ఈ కోటకి వెళ్ళవచ్చు.

Read more

శివపార్వతుల ప్రేమ అమోఘం.

World's first love marriage

ఒకరి గురించి మరొకరు లోతుగా అర్ధం చేసుకోవడం, లోపాలు పెద్ద సమస్య కాదు అన్నట్టుగా మనసు కన్ను తో ఆరాధిస్తూ అర్ధనారీశ్వరులుగా నిలిచిపోయారు.

అమ్మమ్మ గారిల్లు – ఎన్నడూ మర్చిపోలేని ఓ ఆలయం.

అమ్మమ్మ గారిల్లు

ఎన్ని కాలాలు గడిచిన, ఎన్ని తరాలు ముందుకు సాగిన నూరేళ్ల జీవితంలో మారిపోనిది ఏదైనా ఉందంటే అది కేవలం అమ్మమ్మ గారి ఇల్లు, ఆవిడ ప్రేమ మాత్రమే.

తెలంగాణ తల్లి

తెలంగాణ తల్లి

తెలంగాణ ఆడబిడ్డల కట్టు, బొట్టు ఉట్టిపడేలా ప్రసన్న వదనంతో ఉండే నిండైన రూపం.
చూడగానే తెలంగాణ ఆడపడుచులా సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంది ఈ నూతన తెలంగాణ రూపం.

గోన గన్నారెడ్డి

గోన గన్నారెడ్డి కాకతీయ చక్రవర్తి అయినా గణపతి దేవుడు కుమార్తె రుద్రమదేవికి సైనిక అధిపతి.
రుద్రమదేవి పేరు వినగానే ఆమె సాధించిన విజయాలతో పాటు గోన గన్నారెడ్డి కూడా గుర్తుకు వస్తారు మనకు.

error: Content is protected !!