‘మజిలీ’ మూవీకి ఆరేళ్ళు
నాగచైతన్య, సమంత నటించిన మజిలీ సినిమా నేటికీ విడుదల అయ్యి ఆరు సంవత్సరాలు..
అంతకుముందు ఇరువురు కలిసి చాలా సినిమాలు నటించినప్పటికి వారి పెళ్లి తరవాత కలిసి నటించిన మొదటి చిత్రం ఈ మజిలీ సినిమా విజయాన్ని సొంతం చేసుకోవడం మరింత ప్రత్యేకం.
ప్రేమలో విఫలమైన ఓ అబ్బాయి భాదని, పెళ్లి తరవాత ప్రేమ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ఓ అమ్మాయి ఆశని అద్భుతంగా చూపించారు దర్శకుడు శివ నిర్వాణ గారు.
కాలేజీ డేస్ లోనే పూర్ణ ని పిచ్చిన ఇష్టపడిన శ్రావణి ని కేవలం తండ్రి కోసమే పెళ్లి చేసుకుంటాడు అతను.. అయినప్పటికీ ఆమె అతని ప్రేమ కోసం ఆరాటపడింది కాని ఎప్పుడు కూడా ఆవేశాన్ని చూపించలేదు..
ఇప్పటికి కూడా యువత మనసు లో ఈ శ్రావణి పాత్ర ప్రత్యేకంగా నిలిచి పోయింది. ఎంతలా అంటే తమ జీవితం లోకి శ్రావణి లాంటి అమ్మాయి రావాలని ఆశ పడేంతలా.. అంతలా ఈ శ్రావణి పాత్ర ప్రేక్షకులని ఆకట్టుకుంది.
శ్రావణి యొక్క స్వచ్ఛమైన ప్రేమ అలాగే తాను ప్రేమించిన అతను మరొక వ్యక్తితో కనిపించిన కూడా ఆమె ప్రేమలో ఎలాంటి మార్పు లేకపోగా అతని ప్రేమ కోసం ఎదురు చూడటం.. పైగా పూర్ణ గతంలో ఎవరినైతే ప్రేమించారో ఆమె యొక్క కూతురిని తన కూతురిగా స్వీకరిస్తానన్న శ్రావణి ఆలోచన.. ఆమె పాతను మరింత హుందాగా చూపించాయి.
దర్శకుడు శివ నిర్వాణ గారు ప్రేక్షకులకి మంచి ప్రేమకథ చిత్రాన్ని అందించారు.
ప్రేక్షకులు కంటెంట్ లో కొత్తదనంతో పాటు వాస్తవాన్ని కూడా కోరుకుంటారని ఈ సినిమా ద్వారా రుజువు అయింది. చాలా సహజంగా, భావోద్వేగభరితంగా ఉన్న ఈ సినిమా హీరో నాగచైతన్య కెరీర్ లోనే అతిపెద్ద ఓపెనర్ గా నిలిచింది.
ఈ సినిమాలోని పాటలు కూడా బాగుంటాయి. ముఖ్యంగా ‘ ఏ మనిషికి ఏ మజిలీయో పై వాడే చూపిస్తాడు.. నువ్వు కోరుకుంటే మాత్రం దొరికేది కాదంటాడు.. ” మరియు ‘ప్రియతమా’ పాట ప్రతి ఒక్క ప్రేమికుల హృదయాన్ని తాకింది.
సెకండ్ హాఫ్ లో మీరా ఎంట్రీ అయ్యాక కథనం చాలా బాగుంటుంది. మీరా ఎంట్రీ అయ్యాక శ్రావణి, పూర్ణ జీవితంలో వచ్చే మార్పులు కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి.
సినిమాలోని ఒక్క సీన్ యువతకి బాగా అంటే బాగా నచ్చింది. అదేంటంటే గతంలో పూర్ణ.. శ్రావణి వాళ్ళింటికి ఒక పని మీద వచ్చినప్పుడు అతనికి తెలియకుండా చాటుగా అతని కాళ్ళకి నమస్కరించడం.
ఈ సినిమాలో కథనం, పాత్రలు, భావాలు, సంగీతం.. ప్రతిదీ కూడా ఈ చిత్రాన్ని మరింత అందంగా తీర్చి దిద్దాయి.
ఆఖరిగా, దూరమైతేనే కానీ మనిషి విలువ తెలుస్తుంది మరియు మనం ప్రేమించిన వ్యక్తితో కంటే కూడా మనల్ని ప్రేమించిన వారితోనే మన జీవితం బాగుంటుంది అన్నా వాక్యాలు ఈ సినిమా ద్వారా మరోమారు రుజువు అయ్యాయి.
Yes.. Naku Kuda E movie Ante Chala Istham…💓
🤗🤗