నువ్వే నేను

ఎగ్జామ్స్ అయిపోయాయి.. రిజల్ట్స్ వచ్చాక దాన్ని బట్టి ఎం చేయాలో ఆలోచిస్తాను కానీ ముందుగా ఎగ్జామ్స్ బాగా రాసినందుకు దేవుడికి థాంక్స్ చెప్పుకోవాలని అనుకోని గుడికి వెళ్ళాను.


నాలాంటి అవేరేజ్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అంత బాగా రాసేలా క్వశ్చన్ పేపర్ చాలా సులభంగా వచ్చినందుకు చాలా థాంక్స్ స్వామి అని దండం పెట్టుకుని పక్కకి తిరిగేసరికి ఓ అబ్బాయి కనిపించాడు. ఎమన్నా ఉన్నాడా అసలు..తనని చూడగానే ప్రేమలో పడిపోయాను.

ఆరడుగుల ఎత్తు, ఎత్తుకు తగ్గ కటౌట్.. తన స్కిన్ టోన్..ఎర్రట్టి బుగ్గలు, నవ్వుతే బుగ్గ మీద పడే సొట్ట.. పన్ను మీద పన్ను…

ముఖ్యంగా నా కళ్ళు తన చెవి పై పడ్డాయి.. కనిపించని కనిపించినట్టు ఒక స్టోన్, అది ఇంకా తన అందాన్ని రెట్టింపు చేస్తుంది…

నేను అతన్నే చూస్తున్నాను, తన రూపం నా కళ్ళలో నింపుకున్నాను..

తనేమో ఏటో చూస్తున్నాడు, బహుశా ఎవరీ కోసమో వెతుకుతున్నాడేమో..

వెంటనే తేరుకొని దేవుడికి నా మనసులో మాట చెప్పేశా..

పెళ్లంటూ జరిగితే ఇతనితోనే జరగాలి అని..

అలా అన్నానో లేదో ఇంతలో పంతులు గారు..
మా ఇద్దరి దగ్గరికి వచ్చి శ్రీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించారు.

నేను సంతోషంతో దేవునికి మనసులో కోటి సార్లు థాంక్స్ చెప్పుకుని, పక్కకి తిరిగే సరికి ఇతను లేడు..

గుడి మొత్తం వెతికాను కానీ కనిపించలేదు. నిరాశ తో ఇంటికి బయలుదేరాను..

వెళ్లే సరికి అమ్మానాన్న సంతోషంగా మాట్లాడుతు కనిపించారు..

ఏంటి సంగతి.. అంత సంతోషంగా ఉన్నారని అడిగా..

ఎం లేదు తల్లీ, నీ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాము అని బాంబ్ పెల్చారు..


కొన్ని నిముషాల క్రితం నా కోరికని నెరవేర్చిన దేవుడు మీద కోపం వచ్చేసింది..

ఎం మాట్లాడకుండా రూమ్ లోకి వెళ్లిపోయాను..


పెళ్లి మీద ఆలోచన లేని నాకు ఇతను కనిపించి నాలో ఆశలు కల్గించాడు. చేసుకుంటే అతన్నే చేసుకువాలి అని అనుకున్నాను. కానీ,

అమ్మానాన్న కి పెళ్లి ఇష్టం లేదని చెప్పలేను,ఎందుకంటే ఇతని గురించి చెప్పాలి నాకంత ధైర్యం లేదు..

చిన్నప్పుటి నుంచి నేను అడిగిన ప్రతిదీ ఇచ్చి, నన్ను పెంచి ఇంతదాన్ని చేసిన వాళ్ళ మాటకు ఎదురు చెప్పలెను అలా అని ఇష్టం లేని పెళ్లి చేసుకోలేను అని బాధపడుతూ రూంలోనే ఉన్నాను.. బయటికి కూడా రాలేదు..

అమ్మ వాళ్లేమో.. సడన్ గా పెళ్లి అంటే ఏ ఆడపిల్ల అయినా భయపడడం సహజం అదికాక మనల్ని వదిలి వెళ్లిపోవాల్సి వస్తుందని బాధపడుతుందని అనుకున్నారు.. కానీ నా బాధ ఎవరికీ తెలియదు.

———

వారం రోజుల తరువాత..


అమ్మ వచ్చి.. పట్టుచీర, నగలు ఇచ్చి తొందరగా రెడీ అవ్వు.. అబ్బాయి వాళ్ళు వచ్చే టైమ్ అయిందని చెప్పి వెళ్ళిపోయింది…

ఇక చేసేది ఎం లేక.. ఒకసారి తన రూపం గుర్తు చేసుకొని.. అయిష్టంగానే సింపుల్ గా రెడీ అయ్యాను..

కొన్ని నిముషాల తర్వాత..


అమ్మ వచ్చి నన్ను తీసుకెళ్ళింది..

నేను అక్కడ కూర్చున్న అనే మాట కానీ అతనిని తల ఎత్తి చూడలేదు, అతన్ని చూడడానికి కూడా మనసు అంగీకరించడం లేదు..

అబ్బాయి వాళ్ళ అమ్మ అనుకుంట.. అబ్బాయిని చూడు తల్లి అని అంది..


కానీ నేను చూడలేదు.. నాకు పెళ్లి ఇష్టం లేదని మా వాళ్ళకి చెప్పలేను, కానీ ఇప్పుడు ఎం చేయాలి..

ఈ అబ్బాయికి చెప్తే బాగుండు. అప్పుడు ఈ పెళ్లి జరగదు.. కానీ అతనికి ఎలా చెప్పాలి..

అమ్మాయిని నేనే తనతో మాట్లాడాలి అని చెప్తే బాగోదేమో అని ఆలోచిస్తు కూర్చున్నా..

నా మనసులోని భావాలు తనకి తెలిసాయేమో..

అంకుల్… మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయితో మాట్లాడొచ్చా అని అడిగాడు..

మా నాన్న ఒప్పుకోవడంతో…

నేను లేచి టెర్రస్ వైపు నడుస్తున్నాను, అతను నన్ను అనుసరిస్తున్నాడు..


ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నే ఉన్నాను, అతను కూడా ఎం మాట్లాడడం లేదు..

అదేంటి మాట్లాడాలి అని అడిగాడు కదా కానీ ఎం మాట్లాడడం లేదేంటి అని అనుకున్నాను..

కొన్ని నిముషాల మౌనం తరువాత..

అతనే.. నేను మీకు నచ్చానా అండీ అని అడిగాడు..

అతను అలా అడిగేసరికి నాకు కోపం వచేసింది, వెంటనే తల పైకి ఎత్తి చూసాను..

అంతే  ,.. నా కళ్ళు వర్షిస్తున్నాయి, నా కళ్ళని నేనే నమ్మట్లేదు..

వెంటనే.. అమాంతం తనని హాగ్ చేసుకున్నాను..

అయ్యో.. పెళ్ళికి ముందే ఇదేంటండి, నేను అలాంటి వాన్ని కాదు..

కానీ మీకు ఒకే అయితే చెప్పండి నేను రెడీ అని చెవిలో హస్కీ గా చెప్పాడు..

నేను వెంటనే దూరం జరిగీ, తల దించుకున్నాను సిగ్గు తో..

హమ్మయ్య.. మీకు నేను నచ్చేసాను అయితే..
ఎక్కడ నచ్చలేదు అని చెప్తారో అని భయపడ్డాను.. మీరు అలా చెప్తే ఈ వారం రోజులు నేను పడిన కష్టం అంత వృధా అయ్యేది అన్నాడు.

అతని మాటలు అర్ధం కాక అయోమయంగా చూసాను తన వైపు.

తాను నవ్వి….ఆ రోజు పెళ్లి చూపులకి అని ఇక్కడికి వచ్చాను, కానీ మొదటగా గుడికి వేళ్ళు అని మా అమ్మ బలవంతం చేసేసరికి దేవుడంటే నమ్మకం లేని నేను ఆ రోజు మా అమ్మ బలవంతం మీద గుడికి వచ్చాను.

మొదటి సారి నిన్ను గుడిలో చూసినప్పుడే నువ్వు నాకు నచ్చావు, దేవున్ని ఏదో కాకపడుతున్నావు గా.. అప్పుడు ఎంత ముద్దుగా కనిపించావో.. అలానే చూస్తూ ఉండిపోయా…

వెంటనే కళ్ళు తెరిచావు నువ్వు, నన్ను ఎం అయినా అంటావేమో అని బయపడి ఏదో వెతుకు తున్నట్టు దిక్కులు చూసాను….

పంతులు గారు మనల్ని దీవించినప్పుడు నాకెంత సంతోషం అనిపించిందంటే అప్పుడు నేను గాల్లో తేలిపోయాను…


వెంటనే బయటికి వచ్చి, నేను వెళ్లాల్సిన ఇంటికి వెళ్లి… నాకు ఇప్పుడే పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు, మా అమ్మ కోసం వచ్చాను, మీ అమ్మాయికి వేరే సంబంధం చూసుకోండి అని చెప్పి.. నిన్ను వెతకడం ప్రారంభించాను..

ఎంతో కష్ట పడితే కానీ మీ అడ్రెస్స్ దొరకలేదు.. మీ ఇంటికి వచ్చి మీ నాన్న గారితో మాట్లాడదామని వచ్చాను.. అప్పుడే నాకు మాటలు వినిపించి గుమ్మం దగ్గరే ఆగిపోయాను..

మీ వాళ్ళు పంతులు గారికి నీకు మంచి సంబంధం చూడమని చెప్పారు..

నేను పంతులు గారు వచ్చేసరికి ఎదురు చూసి.. ఆయనకి నా ప్రేమ విషయం చెప్పి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా ఇంటికి రావచ్చు అని విసిటింగ్ కార్డు ఇచ్చాను..

అనుకున్నట్టు గానే నా ఫోటో మీ వాళ్లకు ఇచ్చాడు, నేను వాళ్లకు నచ్చడంతో పెళ్లి చూపులకి పిలిచారు..


ఇక్కడికి వచ్చాక నువ్వేమో నన్ను అసలు చూడలేదు. నీకు పెళ్ళి ఇష్టం లేదేమో అని భయపడి.. నీతో మాట్లాడదామని మీ నాన్నని అడిగాను..

కానీ నువ్వు పట్టిన పట్టుకి నీకూడా నేనంటే ఇష్టమని, నువ్వు కూడా నాలాగే మొదటి చూపులో నాతో ప్రేమలో పడిపోయావాని అర్ధం అయింది అని అన్నాడు..


నేను వెంటనే….

పెళ్ళికొడుకు నువ్వని తెలిస్తే ఇంకా మంచిగా రెడీ అయ్యేదాని గా.. పెళ్లి ఇష్టం లేక అయిష్టంగా ఇలా రెడీ అయ్యాను అని అన్నాను..

తాను నా చేతులు పట్టుకొని దగ్గరికి తీసుకోని…

నచ్చాల్సింది కళ్ళకి కాదు, మనసుకి… నా మనసుకి నువ్వు ఎప్పుడో నచ్చేసావ్ అని హాగ్ చేసుకున్నాడు.

1 thought on “నువ్వే నేను”

Leave a Comment

error: Content is protected !!