తెలంగాణ తల్లి

తెలంగాణ తల్లి

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరు తెలంగాణ తల్లిని తమ రాష్ట్ర దేవతగా మరియు జాతి అస్తిత్వ, ఆత్మగౌరవ ప్రతీకగా భావిస్తున్నారు.

తెలంగాణ తల్లి అనే భావం పూర్వం నుండి ఉన్నప్పటికీ తెలంగాణ రాష్టంలోని ప్రజల్లోకి ఓ ఉద్యమ ప్రతీకగా తీసుకోని రావాలన్న ఆలోచన మాత్రం కేసిఆర్ దే.

మొదటిసారి తెలంగాణ తల్లికి రూపానిచ్చే ప్రయత్నం చేసింది ఈ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రచయిత బి. ఎస్ రాములు అయినా కంప్యూటర్ పై తెలంగాణ తల్లి విగ్రహానికి రూపమిచ్చిన వ్యక్తి బి. వి. ఆర్ చారి.

మునుపటి తెలంగాణ తల్లి రూపం :-

బి. వి. ఆర్ చారి గారు రూపమిచ్చిన తెలంగాణ తల్లి కీరిటం తో దేవతా మూర్తి లా ఉంటారు.

కుడి చేత్తో మొక్కజొన్న పంట మొక్కలు, ఎడమ చేత్తో బతుకమ్మ ని పట్టుకుంటారు. జరీ అంచు ఎర్రని పట్టు చీర, చేతులకి బంగారు గాజులు, మెడలో నగలతో ఉంటారు.

రాష్ట్రంలోని పలు చోట్లలో ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఉంది.

కొత్త తెలంగాణ తల్లి ఆవిష్కరణ :-

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు సందర్బంగా ఇరవై అడుగుల నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర సచివాలయంలో 2024 సంవత్సరంలో డిసెంబర్ తొమ్మిదోవ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 

తెలంగాణ ఆడబిడ్డల కట్టు, బొట్టు ఉట్టిపడేలా ప్రసన్న వదనంతో ఉండే నిండైన రూపం.

చూడగానే తెలంగాణ ఆడపడుచులా సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంది ఈ నూతన తెలంగాణ రూపం.

మెడలో నగలు కాకుండా కేవలం బంగారు తీగ మాత్రమే ఉంది.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కుడి చేతితో  అభయహస్తం చూపుతూ,ఎడమ చేతిలో రాష్ట్రంలో శీతోష్ణ పరిస్థితులకు అనుగుణంగా పండించే ముఖ్యమైన వరి, మొక్కజొన్న పంటలను పట్టుకొని తెలంగాణలో వ్యవసాయానికి గల ప్రాముఖ్యతను చాటి చెబుతున్నారు.

మరియు తెలంగాణ తల్లి చేతులకి మట్టి గాజులు ఉన్నాయి.

తెలంగాణ తల్లి వస్త్రధారణలోని పసుపు రంగు అంచుతో ఉన్న ఆకుపచ్చని రంగు చీర పచ్చని పంటలను సూచిస్తాయి.

ఎరుపు రంగు రవిక చాకలి ఐలమ్మలాంటి తెలంగాణ ధీర వనితల పోరాటాన్ని సూచిస్తాయి.

విగ్రహం కింద ఉన్న పీఠంలో పిడికిలి బిగించిన చేతులు తెలంగాణ బిడ్డలా పోరాటానికి ప్రతీక.

ఇక పై ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిదో తారీఖున తెలంగాణ తల్లీ అవతరణ ఉత్సవాన్ని జరపాలని ప్రభత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నూతన తెలంగాణ తల్లీ విగ్రహం రూపకల్పన జవహర్ లాల్ నెహ్రు ఆర్చిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొ. గంగాధర్ గారు చేశారు. కాగా ఈ విగ్రహ శిల్పి రమణారెడ్డి గారు.

తెలంగాణ తల్లిని చూడగానే మన తల్లిని చూసే అనుభూతి కలిగేలా ఈ విదంగా విగ్రహ రూపకల్పన చేశారు.

 

 

Leave a Comment

error: Content is protected !!