What is digital marketting

డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటీ..?

ఇప్పుడు ఎక్కడ చూసిన డిజిటల్ మార్కెటింగ్ పేరే వినిపిస్తుంది. వ్యాపారాలలో అయితే మరీను.
డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ టెక్నాలజీ ద్వారా వ్యాపారాన్ని ప్రమోట్ చేస్తు కస్టమర్స్ ని తెచ్చుకోవడం మరియు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం.

డిజిటల్ మార్కెటింగ్ గురించి వివిధ రకాల నిర్వచనాలు ఉన్నప్పటికీ సులువుగా చెప్పే నిర్వచనం ఏంటంటే – మార్కెటింగ్ అంటేనే ఒక ఉత్పత్తిని ప్రమోట్ చేయడం. అయితే ఈ ప్రమోట్ చేసే విధానాలు రెండు రకాలు.. ఒకటి ఆఫ్ లైన్ రెండు ఆన్లైన్.

ఆఫ్ లైన్ మార్కెటింగ్ :-

అఫ్ లైన్ లో ఉత్పత్తులని ప్రమోట్ చేయడాన్ని ట్రేడిషనల్ మార్కెటింగ్ అంటారు. ఈ మార్కెటింగ్ లో ఉత్పత్తులని, సేవలని న్యూస్ పేపర్, టీవీ, రేడియో మరియు వాయిస్ ద్వారా ప్రమోట్ చేస్తారు.
కానీ ఇలా చేయడం వలన మన బిజినెస్ కస్టమర్స్ కి ఎంతవరకు రీచ్ అయిందో మనకు సరిగ్గా తెలిసే అవకాశం ఉండదు.

ఆన్లైన్ మార్కెటింగ్ :-

ఆన్లైన్ మార్కెటింగ్ కి మరోపేరే ఈ డిజిటల్ మార్కెటింగ్.. ఈ మార్కెటింగ్ లో ఉత్పత్తులని, సేవలని, మరియు బిజినెస్ లని సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ ద్వారా ప్రమోట్ చేస్తారు. దీన్నీ ఇంటర్నెట్ మార్కెటింగ్ అని కూడా పిలుస్తారు.

ఇలా చేయడం వలన కస్టమర్స్ తో కనెక్షన్ పెరుగుతుంది అలాగే బిజినెస్ బ్రాండ్ కూడా.. మరియు మనకు మన బిజినెస్ ఎంతవరకు రీచ్ అయిందో ఒక అవగాహన వస్తుంది.

డిజిటల్ మార్కెటింగ్ ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ మంది కస్టమర్స్ కి రీచ్ అవ్వచ్చు.

ప్రస్తుతం అంతా డిజిటల్ ప్రపంచం నడుస్తుంది కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ చాలా సులువుగా మారిపోయింది ప్రతి ఒక్కరికి..

చాలామంది ఉద్యోగులు వాళ్ళ ఉద్యోగాన్ని వదిలేసి ఈ డిజిటల్ మార్కెటింగ్ రంగం వైపే మక్కువ చూపుతున్నారు.

డిజిటల్ మార్కెటింగ్ లోని అంశాలు :-

అనేక రకాల అంశాలు లేదా టూల్స్ ఈ డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్నాయి.. ప్రతి టూల్ పైన నైపుణ్యం సంపాదించుకొని ఉద్యోగం కూడా పొందవచ్చు.

ప్రతి టూల్ కి ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి.

అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. వెబ్సైట్ డిజైన్ – మన బిజినెస్ కి తగినట్టుగా వెబ్సైట్ డిజైన్ చేయడం.

2. కంటెంట్ రైటింగ్ – వివిధ భాషలలో బ్లాగ్ లలో ఆర్టికల్ రాయడం.

3. సెర్చ్ ఇంజైన్ ఆప్టిమైజేషన్ – వెబ్సైట్ వివిధ రకాల సెర్చ్ ఇంజైన్ పేజీలలో ర్యాంక్ అవ్వడం.

4. సోషల్ మీడియా మార్కెటింగ్ – బిజినెస్ ని అనేక సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ ద్వారా ప్రమోట్ చేయడం.

5. ఇమెయిల్ మార్కెటింగ్ – బిజినెస్ కి సంబందించిన సమాచారం అంతా ఇమెయిల్ ద్వారా కస్టమర్స్ కి తెలియచేయడం అలాగే వాళ్ళ నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం.

6.గూగుల్ అడసెన్స్ :- బ్లాగ్ లలో వివిధ రకాల ప్రకటనలు ప్రదర్శించడానికి అలాగే వాటి నుండి ఆదాయం పొందాడానికి ఉపయోగపడే టూల్.

7. గూగుల్ ఎనాలిటిక్స్ :- ఈ టూల్ ద్వారా వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ ని అలాగే యూజర్స్ వెబ్సైట్ లో ఎంతసేపు ఉన్నారో తెలుసుకోవచ్చు.

ఇంటర్నెట్ మార్కెటింగ్ కోర్సు వివరాలు :-

డిజిటల్ మార్కెటింగ్ కోర్సు కి ఎలాంటి వయసు, చదువు పరిమితం లేదు.. ఇంటర్నెట్ మరియు కంప్యూటర్ మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కోర్సు నేర్చుకోవచ్చు.

ఈ కోర్సు ఆన్లైన్ లో మరియు ఆఫ్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి..

కోర్సు మొత్తం పూర్తి అయ్యాక మీకు సర్టిఫికెట్ ఇస్తారు.. కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ లేకపోతే విశ్వవిద్యాలయాలు ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా కలిపిస్తారు.

అయితే సబ్జెక్టు నేర్పించే ఇన్స్ట్రక్టర్ కి ఈ డిజిటల్ మార్కెటింగ్ లో ఎంత అనుభవం ఉంది, ఈ సబ్జెక్టు లో ఎలాంటి అంశాలు కవర్ అవుతాయి..? కోర్సు పూర్తి అయ్యాక సర్టిఫికెట్ ఇస్తారా లేదా..? ఇలాంటి విషయాలని దృష్టిలో పెట్టుకొని డిజిటల్ మార్కెటింగ్ కోర్సు నేర్చుకోండి.

కొన్ని డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సిస్ కూడా స్వయంగా ఈ కోర్సుని అందిస్తాయి.

డిజిటల్ మార్కెటింగ్ లో ఉద్యోగ అవకాశాలు :-

ఈ డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న టూల్స్ ఆధారంగా అపరిమిత ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.. ప్రతి టూల్ పైన నైపుణ్యం సంపాదించుకొని సులువుగా ఉద్యోగం పొందవచ్చు.

డిజిటల్ మార్కెటింగ్ లో నైపుణ్యం సంపాదించుకున్నాక ప్రాక్టికల్ అనుభవం చాలా అవసరం.. ఆ అనుభవం కోసం సొంతంగా బ్లాగ్ రన్ చేయవచ్చు లేకపోతే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లపై వర్క్ చేయవచ్చు. మరియు ఫ్రీ లాన్సర్ ఫ్రీ లాన్సర్ కూడా అనుభవం సంపాదించుకోవచ్చు.

భారతదేశంలో డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగాలలో జీతం 2.5 లక్షల నుండి మొదలవుతుంది.

అదే ఈ రంగంలో మంచి అనుభవం ఉన్నట్లయితే 12 లక్షల నుండి ఇరవై లక్షల వరకు సంపాదించవచ్చు.

డిజిటల్ మార్కెటింగ్ లో భవిష్యత్ :-

ప్రస్తుతం ట్రేండింగ్ ఉన్న సబ్జెక్టు మరియు ప్రొఫషన్ ఈ డిజిటల్ మార్కెటింగ్..

రాబోయే రోజులలో దీనికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.. ఈ రంగం ఎల్లపుడు మారుతూ నిరంతరంగా అభివృద్ధి చెందే రంగం. ఇందులో మనం రానించినట్లయితే ప్రకాశవంతమైన భవిష్యత్ మన సొంతం..

ఈరోజుల్లో చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా వాళ్ళ వాళ్ళ ఉత్పత్తులని ప్రమోట్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

డిజిటల్ మార్కెటింగ్ లో నైపుణ్యం సంపాదించుకోని మనమే సొంతంగా బ్లాగ్ రన్ చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ గురించి అందరికి తెలిసిన కానీ నైపుణ్యం మాత్రం చాలా తక్కువ మందికి ఉంది.. ఆ నైపుణ్యం సంపాదించుకొని, ఎప్పటికప్పుడు వస్తున్న అప్డేట్స్ లా గురించి, కొత్త టెక్నాలజీస్ గురించి తెలుసుకొని మరింత వేగంగా ఈ రంగంలో రానించవచ్చు.

Leave a Comment

error: Content is protected !!