శివ పార్వతుల ప్రేమ అమోఘం.
ఈ ప్రపంచంలోనే మొదటి ప్రేమ వివాహం ఎవరిది అని ఇలా అడగ్గానే అలా ప్రతి ఒక్కరి నుండి వచ్చే సమాధానం ఉమామహేశ్వరుల వివాహం అని.
అందరిలా సామాన్యమైన ప్రేమ కాదు వారిది. ప్రపంచం మొత్తంలో వీరి ప్రేమని మించిన అందమైన మరియు అద్భుతమైన ప్రేమ మరొకటి లేదు, ఉండదు కూడా.
వీరి ప్రేమలో అన్నీ కూడా సమపాళ్లలో ఉన్నాయి. గౌరవం, నమ్మకం, సమానత్వం, ఐకమత్యం, త్యాగం, అనురాగం, సహనం, అవగాహన… ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో, ఇంకెన్నో కూడా వీరి ప్రేమ నుండి నేర్చుకోవచ్చు.
ఈ ఆదిదంపతుల ప్రేమ ప్రపంచానికి నిదర్శనం, ఒకరి పట్ల మరొకరికి నమ్మకం. ఒకరి కోసం మరొకరు చేసే త్యాగం. ఒకరి గురించి మరొకరు లోతుగా అర్ధం చేసుకోవడం, లోపాలు పెద్ద సమస్య కాదు అన్నట్టుగా మనసు కన్ను తో ఆరాధిస్తూ అర్ధనారీశ్వరులుగా నిలిచిపోయారు.
ప్రేమ ఉన్నచోట నమ్మకం కూడా ఉంటుందన్న మాట బహుశా వీరి ప్రేమ నుండే పుట్టి ఉండచ్చు.. అంతా నమ్మకం ఇరువురికి.
ఒకరు ఏదైనా చేస్తే మరొకరికి చిరునవ్వుతో స్పందించడం మాత్రమే తెలుసు కానీ ఎందుకు ఇలా చేసావు అంటూ నిలదియ్యడాలు తెలియదు ఇరువురికి.
ఇది చేస్తాను అంటే ఒకరినొకరికి అడ్డు చెప్పే ఆలోచన లేని ఈ సతీపతులు ఈ ప్రపంచంలో ఉన్నవాళ్లందరికి తల్లితండ్రులు.
వేల సంవత్సరాల నిరీక్షణలో ప్రేమ యొక్క మాధుర్యం దాగి ఉంటుందని శివుడి ప్రేమ తెలియజేసింది.
శివుడు అంటే ఎంత ప్రేమ, ఆదరణ ఉంటే ఉపవాసంతో, ఎండిన ఆకులు తింటు తపస్సు చేయాలి పార్వతి మాత. ఆ తప్పస్సు శివుడి మనసుని కదిలించింది..
వీరి ప్రేమ ఎలా మొదలైంది..?
పురాణాల ప్రకారం శివుడి భార్య అయిన సతి దేవి దక్ష ప్రజాపతి కుమార్తె. దక్ష ప్రజాపతి కి శివుడు అంటే అసలు నచ్చడు. సతీదేవి ముందే శివుడు గురించి దుర్భాషులాడుతాడు, శివుణ్ణి అవమానిస్తాడు.
అది తట్టుకోలేని సతీదేవి తన భర్త గౌరవం కాపాడటం కోసం అగ్ని లో దూకి ఆత్మా హుతి చేసుకుంటుంది.
శివుడు సతి లేదన్న నిజాన్ని తట్టుకోలేకపోయాడు, ఎంతగానో కుమిలిపోయాడు..
సర్వసం తెలిసిన ఆ శివుడు మొట్ట మొదటగా కన్నీరు కార్చింది అప్పుడే..
కాలిన సతీదేవి శరీరాన్ని పట్టుకొని ఎంతగానో రోధించాడు. సతి శరీరం తో ముల్లోకాలు తిరుగుతూ ఎంతగానో బాధపడ్డాడు.
మహాదేవుడు కన్నీరు కారిస్తే జగానికి మంచిది కాదని నారాయణుడు తన విష్ణు చక్రం తో సతీదేవి శరీరాన్ని ఎనిమిది భాగాలుగా విభజించాడు. ఆమె శరీరం ఎనిమిది చోట్ల పడింది.. అవే అష్టదశ శక్తి పీఠాలు.
సతీదేవి మళ్ళీ పార్వతి మాతగా పుట్టి తన దరికి చేరేవరకు కొన్ని సంవత్సరాలు ఎదురు చూసాడు ఆ ఈశ్వరుడు.
పార్వతి మాత తన దరికి చేరిన క్షణం శివుడి సంతోషం వర్ణనాతీతం.
ఒకరికొకరు :-
శివపార్వతులు ఎల్లపుడు ఒకరి కోసం మరొకరు అన్నట్టుగా ఉంటారు.
ఒకటే ఆలోచన, ఒకటే మాట, ఒకరి కోసం మరొకరు చేసే త్యాగాలు శివపార్వతులా బంధాన్ని మరింత బలపరచాయి.
ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమ అనంతం. ఒక్కటవ్వడం కోసం ఎంతో భాదని అనుభవించిన వీరి ప్రేమలో ఎన్నో అందమైన భావాలు దాగి ఉన్నాయి. ఆ భావాలకి నిదర్శనమే ఈ దంపతులు..
ముగింపు :-
ఇప్పటికి, ఎప్పటికి శివపార్వతుల అనురాగం, ప్రేమ అనంతం, అద్భుతం, అమోఘం.
ఎదురుచూడటంలోనూ ప్రేమ ఉంటుంది. నేనున్నాను అంటు సహకారం అందింవ్వడంలోను ఐకమత్యం ఉంటుంది. లోపాలని లెక్కచెయ్యకుండా ఉండే విధానంలో ఒకరి పట్ల మరొకరి అవగాహన ఉంటుంది.
త్యాగంలోను ప్రేమ ఉంటుంది. ఎంతటి వారు అయినా కానీ ఆ ఇరువురు ఇచ్చుకునే గౌరవంలోను ప్రేమ ఉంటుందని శివపార్వతుల ప్రేమ తెలియచేసింది.
ఓం నమః శివాయ..
Disclaimer :-
నాకు తెలిసింది, నేను తెలుసుకున్నది శివయ్య మీద ఉన్న భక్తి భావంతో ఇక్కడ రాయడం జరిగింది.
ఏదైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి.
Nice
Tqq🤗🤗
ఓం నమః శివాయ 🙏🙏🙏
🙏🙏🙏
Greetings,
I hope this message finds you well. We are seeking strategic business partners and individuals interested in collaborating on exclusive investment opportunities. We represent a network of high-net-worth individuals (HNWIs) from Ukraine, Russia, Africa and the Middle East
Given the nature of the funds, further details will be shared upon request including amount involved. If it interests you to collaborate with us at no risk, please feel free to reach out for a confidential discussion.
Looking forward to your response.
Best regards,
Alex Amin
Email:alexanderamin@infinitycapitalinc.org